నిలయ నిర్భంధము
నిలయాన నుండుటే నిర్భంద మనుకోకు
ఆత్మరక్షణకది యవస రమ్ము
పగవాని నిర్జింప బలవంతమైనట్టి
ఆయుధమ్మిదియేను యవనిలోన
క్రిమితోడ సమరమ్ము క్రీడగా తలచకు
కంటికాననియట్టి కర్క శంబు
సమరమ్ము చేయగా సామర్థ్యమున్ జూపు
మందుకనిపెట్టి వలయు మరువ కోయి
శాస్త్రజ్ఞు లెల్లూరు శ్రధ్తతో వారంత
పరిశోధనల్ చేసి ఫలిత మొసగ
ధృత్యున్నతోత్సాహ ఢృఢదీక్ష పరులై
వర్తిల్లు చున్నారు వసుధలోన
ఆ.వే.వేచి చూడవలయు వేరు మార్గము లేదు
ఆత్రపడిన నింకయర్ద మేమి
దూర మెకటె రక్ష దూర్త రోగమునకు
తెలివి యెకటి రక్ష తెలుసుకొనుము
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి