ప్రాతిభాసికము
ప్రాతిభాసికమంచు పాలుమాలగలేను
కట్టెదురునిజము కదులు చున్న
వ్యవహార సత్యంబు వస్తుగత మైపోయొ
వలవలాయేడ్చిన వదిలి పోదు
పరమార్థసత్యంబు బ్రహ్మవిదునికెరుక
ప్రాపంచికులకేది ప్రాప్త మయ్య
వేదాంత వీధిలో వెలుగురేకలకిట్లు
నరునివెదుకులాట నవ్వు లాటె
ఆ.వె. తత్త్వ మెరుగగంగ తలచిక్కు చేసిన
ధాత మనకు చిక్క దారి తెలియు
అంత వరకు మనకు నంతులేనట్టిదౌ
బాధకన్న యేది భార మగును
(కరోనా వైరస్ పై ఆవేదనతో)
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి