విశ్వనాథ దర్శనము
కాశికా విశ్వేసు కనులార గాంచగా
దురితౌఘమెల్ల తూలినట్లు
ఆనంద వనమున నానంద మూర్తిని అభిషేక మొనరింప నాత్మతృప్తి
అవిముక్త క్షేత్రాన నానంద లహరిలో
అసుతోషు పూజయె (సేవయే)హాయిగొల్ప
తారకమంత్రంబు తత్త్వోప దేశంబు
విశ్వేశు భక్తియే విశద పరచ
అన్న పూర్ణతల్లి నమ్మయై నాదరింప
చింత లెల్ల బాపు శివుడు తండ్రి
బంధుజనులు మనకు భవుని భక్తచయము
జగతియంత మనకు జన్మ భూమె
(రచన:--విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజ శాస్త్రి)
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి