మధుమాసం
మధు మాసమరుదెంచి మమతాను రాగాల
మధువంత పంచగా మనకు తెచ్చె
ఆమని రాకతో అందాల హరివిల్లు
అవనిలో నంతటా అలము కొనియె
మరుమల్లె తావియె మధురోహ లెన్నియో
మనసంత నింపగా మనకు నిచ్చె
కోకిలా రావమ్ము కొరకునై చెవియొగ్గి
వేడ్కతో నేనంత నిలిచినాను
ఆ,వే:౼కాలమంతగడిచె కనుమూసి తెరువగా
తిరిగి వచ్చె నన్ని.తిథులు మరల
ధాత నాటకాన నటులమయ్యమనము
సృష్టికర్త యెక్క దృష్టి యిదియె
(రచన:౼విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజ శాస్త్రి)
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి