భజగోవిందశ్లోక భావమును వాదము

1ఎవరు భార్యపుత్రుడెవరోయి మిత్రుండు
కాపురంబు చూడకలుగువింత
ఎవరు తనదురాక యెటునుండి తెలియక
తత్త్వ మెరుగ తరమె ధరణిలోనే
2బాల్యమేమొ యాటపాటలకరుగును
యువతి వలపు చిక్కె యవ్వనమ్ము
ముదిమి వయసులోన ముసురుకొనునుచింత
బ్రహ్మ ముందు మనసు పారదకట!
(ముక్తికోరనట్టి మూర్ఖ బుధ్ధి)
3 ప్రాణమున్న వరకె భార్యాను బంధమ్ము
కుశలమడుగు తాను కూర్మి మీరు
ఊపిరాగగానె యుండదు బంధమ్ము
మాయదారి జగతి మర్మమింతె

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత