గురువు

అజ్ఞాన తిమిరంబు నంతంబు చేయగా
గురువుండవలయును గుర్తు గాను
అమ్మనాన్నలతోడ నాచార్యడెపుడైన
పూజింపదగునోయి పుడమిలోన
చదువుసంధ్యల నేర్పి సామర్థ్య మందించు
గురువెయధికుడోయి కువలయాన
గురుసేవ వలననే  గుర్వర్థ మందిరి
రామకృష్ణాదులు  రక్తిమీర
ఆ.వే.గురువులేనివిద్య గుడ్డివిద్యయగును
శ్రధ్ధ లేని విద్య శాపమగును
బధ్ధకంబు లేక పొందవలయు విద్య
నేర్వ వలయు విద్య నేర్పుగాను
(రచన:౼విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజశాస్త్రి)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత