ఆధ్యాత్మ తత్త్వమ్ము

ఆద్యంతముల్ లేనియధ్యాత్మ తత్త్వంబు
వేదాంత మార్గంబు వేద మయము
భారతీయాత్మయే పరమార్థ  పథమాయె
జ్ఞానంబు యోగంబు సాధనాలు
కావ్యాలు శాస్త్రాలు కళలన్ని బోధించు
పురుషార్థ ధర్మాలు పొల్లుబోక
ఇతిహాసకథలన్ని యింపైన రీతిగా
చెలికాని వలెతెల్పు చెలిమి మీర
ఇ.వే.అంక గణిత మందు నందాల చందాలు
బీజగ ణితమంత భూజమగును
పూర్ణబిందువంత పుడమిలో వ్యాపించె
భరత మాత పేరు వాసికెక్క


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత