నా పండిత శిక్షణా యాత్ర
"పెళ్ళి కుదిరిన పిచ్చి కుదురును
పిచ్చి కుదిరిన పెండ్లి జరుగును"
ఇదే కొన్ని మార్పులతో తెలుగు పండిత శిక్షణ విషయంలో నా అనుభవం.
1973 వ సం||రంలో. విజయవంతగా విద్వాన్ కోర్స్ ముగిసిన తరువాత తెలుగు పండితునిగా అవతార మెత్తడానికి పండిత శిక్షణా కేంద్రంలో చేరడానికి విశ్వ ప్రయత్నమే చేయవలసి వచ్చింది.
"ట్రైనింగ్ నిమిత్తము శిక్షణా సంస్థకెడితే ఎక్సీరియన్స్ అడుగుతారు.
మీ పాఠశాలలో అనుభవం కోసం చేర్చుకోమంటే ట్రైనింగ్ అయ్యిందా? అనే ప్రశ్న." ఇలా దారి తెన్నులేని పయనం సాగింది. ట్రైనింగ్ లేనిదే ఉద్యోగం దొరకదు.ఎలా!
ఇప్పటిలా అప్పుడు పండిత శిక్షణా కేంద్రాలు అధికంగా లేవు.నాకు తెలిసినంతగా కర్నూలులోను ,భాగ్యనగరాన ఆంధ్రసారస్వత పరిషత్తే వున్నాయి.
కాల్పులు శిక్షణా సంస్థ " పెండ్లి - పిచ్చి" ఫార్ములా ఉపయోగించి చాట కొట్ఝారు.
ఇక మిగిలింది భాగ్యనగరాన ఆంధ్రసారస్వతపరిషత్తు.
అది కూడా ఆషామాషిగా రాలేదు.
అందుకు భగీరథ ప్రయత్నమే చేయవలిసి వచ్చింది.మా తండ్రిగారికి తాళపత్ర పరిచయమున్న డా| దివాకర్ల వెంకటావధానిగారింటికి వెళ్ళి నా చతుస్సాగరపర్యంతం చెప్పిన తరువాత ఆప్యాయంగా పలకరించి "నా వంతు ప్రయత్నం చేస్తా" నని ఆభయదానం చేసారుఆరోజు వారింట అనుకోని అతిధినయ్యాను.
విచిత్రంగా దివిసీమలో గ్రామశ్రీ సంస్థలో శ్రీరామకృష్ణ పరమహంస గారి గురించి
ఉపన్యాసనిమిత్తము వచ్చినప్పుడు మా యింటికి భోజనమునకు రావడం నా అదృష్టం.(వారు శ్రోత్రియకుటంబంలోనే భోజనం చేసె నియమం కలవారు కాబట్టి ఆ చిన్న అదృష్టము నాకు దక్కింది.)
ఇంతటి కథముగియలేదు. అప్పుడు ఆంధ్ర సారస్వత పరిషత్ కు కీ.శే.దేవులపల్లి రామునుజరావుగారు కార్య దర్శులు.
ఇంకా రెండు మూడు పెద్దవే పరిచయ పత్రాలతో గానీ పండిత శిక్షణా ప్రవేశం చిక్కు లేదు. కాలం మారింది తెలుగుభాషామ తల్లికి అమూల్యమైన సేవలందిస్తున్న ప్రాచ్య కళాశాలలు శిక్ష మా సంస్థలు తమ అస్తిత్వం కోసం కొన ఊపిరితో పోరాడు తున్నాయి.
తెలుగుభాషాభివృధ్ధి జరగాలంటే ప్రాచ్య కళాశాలలు వుండి తీరాలి.మహాకావ్యాలు మట్టిలో కలువకుండా కాపాడాలి. అందుకు ఉభయరాష్ట్రప్రభుత్వాలు సహాయసహకారాలు అందించాలి.
ఆంగ్ల భాష వద్దనలేదు.కానీ పరభాషా వ్యామోహం పనికిరాదు.
మరికొన్ని ముచ్చట్లు తరువాత
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి