లక్ష్మీ పార్వతీ సరస్వతీ
దుర్గమ్మ తల్లియె దుష్టాత్ము దునుమాడి
కారుణ్య జలధియై కాచు మమ్ము
సంగీత మొకవైపు సాహిత్య మొకవైపు
శారదా రూపాన సంతరించు
పాలకడలి పట్టిపద్మహస్థంబుతో
పరమార్థ మందించి భాగ్య మొసగు
పార్వతీ మాతయై పరమేశు పత్నియై
భక్తాళి భయమంత పారద్రోలు
అంబ యిఛ్ఛలేక నాకైన కదలదు
వాణి కరుణ వలన వాక్కు కలుగు
విజయ లక్ష్మి కరుణ విజయమందగలవు
జగతి సూత్ర మంత జనని యెరుగు
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
(రచన:౼విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజశాస్త్రి)
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి