ఆదివిష్ణవు
పర్యంక మంతయుఫణిరాజ యాయెను
ఆదియంతములేని నాత్మ మయుడు
ఉండవల్లిగుహల నున్నవాడతడయ్య
భోగీంద్ర శయనుడౌ యోగియతడు
క్షీరాభ్ధి శయనుడౌ శ్రీహరే మాయుర
మమ్మేల వచ్చిన మాధవుండు
తిరువనంతపురము తిరగలేరు వీరంచు
కదలివచ్చినేమొ కరుణతోడ
ఆ.వే.పద్మ నాభు కరుణ భవభీతిహరము
ఆశ్ర యించు వారి కమిత ఫలము
నమ్మి నట్టి వారి నట్టీంటి వేల్పాయె
దండ మిడగ రండి దండిగాను
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి