కరచాలనము
కరచాల నంబులు కన్నను కైమోడ్పు
మన్ననే లోకాన మంచిదాయె
కౌగిలింతల జోరు కాటికే దారంచు
కఠినమౌ పాఠము కరొన నేర్పె
ముద్దులు మురిపాలమోహాలంతంబాయె
ప్రాణభయము కాస్త పదునుకెక్కె
మాంసంబు మ్రింగమీ మాంసమధనమంత
చర్చోప చర్చలు సాగసాగె
దహనమే మేలంచు దాక్షిణ్య బుధ్ధియే
భారతీ భావంబు ప్రబల మాయె
చాదస్త మనకోయి చావుభయము మాన్పు
సరియైన మందోయి శ్రధ్ధ చూపు
ఆ.వె.పెద్ద లన్న మాట సద్దిమూటనుటెల్ల
సత్య మాయెనేడు సరిగ వినుము
అనుభవంబుకలుగు నాప్తవాక్యమిదియె
ఆచరించి చూడ యదను యిదియె
(రచన:--విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజ శాస్త్రి)
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి