మతమార్పిడి

1మందు మార్చినట్లు మతము మార్చదగునె
మతము  మార జబ్బు మాయమగునె
కర్మవశత చేత కలుగవా రోగాలు
అనుభవింపకుండ యసలుపోవు
2 మతము మార కులము మాయమౌ పోవును
కులము పోయె ననచు కుమల వలదు
ఉన్నమతమె చాలు నుధ్ధరించునెపుడు
నాగరాజు మాట నమ్మమింక
3పాపివనుచు నీవు పలుమారు పలవింప
పాపివైతీవోయి ఫలిత మింతె
మూలపాపమనుచు  మూర్ఖంపు బుధ్ధి తో
కలవరింపదగునె కష్ట చరిత

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత