గోవింద

గోవింద గోవింద గోవిందా యనుచును
స్నానంబు చేయగా సాగుమోయి
గోవింద నామంబు కోర్కెమీరునటుల
స్మరణచేయుమోయి సతతమిట్లు
ధ్యానంబు ధ్యేయంబు ధ్యాతవ్యుదతడేను
గోవింద యనుచును కోరుకొమ్ము
 కోటిజన్మలపుణ్యంబు గోవింద కీర్తనే
అనుచుతలచకొమ్ము నాత్మ బుధ్ధి
ఆ.వే.ఇంతకన్న మనకు నిహమేమి పరమేమి
ముక్తి మార్గ మిదియె యుక్తి యుతము
ఆశ్రయించరండి నచ్యుతు చరణాలు
భక్తి యెకటె మనకు ముక్తినొసగు
(రచన:--విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజ శాస్త్రి)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత