పద్య వైరుధ్యము

ఆటవెలదితోడ యాటాడి యాటాడి 
అలసిసొలసినాన నాదమరచి
తేటగీతి యొకటి తెలివితో తానంత
పద్యమొకటి చెప్ప పట్టు బట్టె
అందమొలకునట్లు కందమల్లమనుచు
కాఠిన్యమొప్పగా కంద మరచె
ద్విపద పద్యమొకటి ధీరత్వ మొప్పగ
పద్యంబు చెప్పగా పట్టుబట్టె
ఆ.వే.భావమేమి లేక పద్యంబు చెప్పగా
కలము కదల దంచుపలకగానె
తరచి చూడ తట్టదా భావంబు
రాయవలయుననచు రభస చేసె
(రచన:--విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజ శాస్త్రి)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత