కార్తిక స్నానాలు
కార్తీక మాసాన కావింతు స్నానమ్ము
వేకువ ఝామునే వేడ్క మీర
దేదీప్య మానమౌ దీపాలు వెలిగించి పరమేశు ప్రార్థింతు భక్తితోడ
అర్చనంబొనరింతు నభిషేక మొనరింతు
శివలింగ మునకంత చిత్త శుధ్ధి
పావనంబైనట్టి పరమేశు కథలన్ని
పఠియింతు వినిపింతు పరమభక్తి
ఆ.వే.చేతులారగాను శివపూజ లొకవైపు
హరినిజపముసేతు నార్తితోడ
ఇహము పరము లొసగి యిష్టార్థమొనగూర్చు
ముక్తిపథము జూపు భక్తి నొసగ
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి