గగన కుసుమాలు

గగన కుసుమాలు గళమున శోభిల్ల 
చిరునవ్వు చిందించు చిద్విలాసి
ఎండమావి జలము యేరులై పారించి
వ్యవ"సాయ"మొనరించు వ్యక్తి యితడు
కుందేటి కొమ్ముతో కువలయంబంతయు
కూర్మితో పాలించు ధార్మికుండు
గార్ధభాంఢముతోడ గమ్మత్తుచేయగా
మనవద్ద కొచ్చిన మాంత్రి కుండు
ఆ.వే. ఒప్పుతప్పులన్ని నోర్పుతో కలిపేసి
తప్ప పట్టుటండు తత్పరుండు
వంధ్య పుత్రు డన్న వాత్సల్య భావంబు
మనకు దక్కె ననచు మరువదగునె
(చూపగలిగి నట్టి సూనృ తుండు)
【రచన:౼విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజశాస్త్రి】

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత