లాక్ డౌన్ కవిత
అన్నిమూసిరనుచు నావేదనంబేల
ఆదిత్యుడరుదెంచు నాగకుండ
ఆప్యాయమనురాగమనుబంధమంతయు
నిత్యంబు నియతిలా నిలిచె నిపుడు
సంసార బంధమ్ము సానందమయమాయె
కారుణ్య భావమ్ము కొనలు సాగె
సృజనశీలమిపుడుహృద్యమౌ రీతిగా
కొత్తపుంతలు ద్రొక్కె కోర్కె లట్లు
ఆ.వె. గడప దాట కుండ గడియించు జ్ఞానమ్ము
అంది వచ్చె నిపుడు నందు కొండు
అవసరమ్ము నేర్పు నధ్భుతంబౌరీతి
మంచి తరుణ మిదియె మరువ కండి
(రచన:---విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజ శాస్త్రి)
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి