నాదు ఘనత సహినహి
జననమందితివయ్య జననీజనుకులచే
నీదుఘనతలేదు నిక్కమిదియె
అమ్మానాన్నలచేతనామమొకటిగల్గె
నీదుఘనతలేదు నిజము కనుము
ఒజ్జలొసగినారు వోర్మతో విద్యను
నీదుఘనతలేదు నిజముసుమ్ము
పదవియొదిగినీకు పరులవలనకాదె
పదవివలననీకు పైక మబ్బె
పరువుమర్యాదలు ప్రఖ్యాతి యంతయు
(రచన:--విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజ శాస్త్రి)
సంఘంబువలనను సంఘటిల్లె
ఆ.వే.ఆస్తి పాస్తు లెల్ల యన్యుల పాలౌను
ఊపిరాగినంత నూడ్చినట్లు
గర్వం పడుట యేల ఘనమైన వాడంచు
బుద్బుదంబు బ్రతుకు బుగ్గిపాలు
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి