ఆశ్రమ వాసము

కానన భూమియే కైవల్య సదనమ్ము
ఆచార్య పీఠమై నమరె నడవి

ఆచార్యుసేవలోనాధ్యత్మ విద్యను
గ్రహించిశిష్యండు జ్ఞానియగును
ఆద్యంతముల్లేని యధ్యాత్మ విద్యను
అందించి నారయ్య యాశ్రమాన
మంత్రమ్ము దర్శించి మౌనీంద్రు లెల్లూరు
విశ్వాని కిచ్చిరి వేదరాశి
నిగమశిఖలతోడ నిగమైక వేద్యుని
ధ్యానంబు చేసిరి  తపసులెల్ల
బాదరాయణుడంత బ్రహ్మ సూత్రుదులెల్ల
సంతరించెనుకాదె సాంద్ర కరుణ
 తే.గి.విశ్వ కళ్యాణ శీలురై వెలసి నట్టి
పరమ రుషులెల్ల కానల పరిగి నారు
అంతె వాసులు నధికమౌ భక్తితోడ
చదువు నేర్చిరి వారంత చక్కగాను
(రచన:--విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజ శాస్త్రి)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత