మూర్ఖుడు

అజ్ఞాన తిమిరాన్ని యంతంబు చేయగా
అనుమతింపనియట్టి యర్భకుండు
మూడకాళ్ళెశశికి ముందుచూడుడనుచు
నమ్మబలుకుచుండు తానుయెపుడు
తనకుతెలియదాయె తనకుచెప్పిననైన
ఒప్పుకొననియట్టి వట్టి శుంఠ
పొరుగుదేశమనిన పొంగిపొర్లును ప్రేమ
మాతృదేశమనిన మత్సరమ్ము
ఆ.వే.ఆత్మ కీర్త నంబు ననిశంబు సల్పును
పరుల నింద లోన ప్రథము డతడు
సమయ మెరుగ కుండ సల్ల్పాప మాడును
ఏడ్చు వేళ యెగిరి  యెగిరి నవ్వు
(రాహుల్ గాంధికి అంకితంగా)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత