వామపక్ష మెపుడు

వామపక్ష మెపుడైన వలపక్షమున్ పూను
వర్గశతృవనుచు వదరుచుండు
మతముమత్తుయనుచు మాటాడు చుండును
ఇతరమతములన్న యిష్టపడును
భారతీయ మన్నతో బాధతో కృంగును
గతితర్క వాదన గంతులిడును
పడికట్టు మాటల పందిరల్లచునుండు
అయినవారికెపుడె యాకె పెట్టు
కానివారికెపుడు కంచాలు పెట్టును
ఆ.వే.కాల గర్భ మందు కలిసిపోయినదాని
కాయకల్ప మేల కలిసి వచ్చు
సామ్య వాద మంత చాపచుట్టరికాదె
ఏమి యున్న దనుచు యెగసి పడగ

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత