పగటికలలు

పగటికలలకన్న పరమాధ్భుతంబేమి
తృప్తిచెందగలము హృదయమందు
ఇలలోని కోర్కలు యీడేర పనిలేదు
స్వప్నలోకమ్మంత స్వర్గం మట్లు
ఊహలనుయ్యాల నూ
రేగ వచ్చును
తాడుతెగుననచు తపన లేదు
కలలోన తినవచ్చు కలమాన్న భుక్తిని
పస్తులుంటిననచు బాధ యెకటె
ఆ.వె.ఇన్ని యిడుములున్న యిలలోన మనకింక
కలలెతోడు యనుచు కల్ప నమ్ము
పగటి కలలు తోడి పబ్బము గడుపుటె
మనకు వచ్చు నట్టి మంచి విద్య
(రచన:--విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజ శాస్త్రి)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత