వనమాలి వరమాల

వనమాల ధరియించి వయ్యార మొలకించి
భక్తాళి నీవెంట పరుగు పెట్ట 
ఆవంక భూలక్ష్మి యీవంక శ్రీ లక్ష్మి
హృదయాన నిలిపావు హృద్య ముగను
చక్రంబు చేపట్టి శంఖంబు పూరించి
దనుజమర్దన చేసీ డస్సి నావీ
ఫణిరాజు పడకగా పవ్వళించితివీవు
అరమోడ్పుకనులతో నందమొలక
ఆ.వే.వైన తేయు నెక్కి వైళంబు పయనించి
భక్త జనుల బ్రోవ వచ్చి తీవు
నిన్నునమ్మినాను నిరతంబు నీదయ
కురియజేయుమయ్య కూర్మి మీర

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత