విశ్వమూ-విష్ణుడు

జగతినంతనుతాను జాగృతమొనరించి
మనుజధర్మంబును మనకు నేర్ప
కైలాసగిరినుండి కదలివచ్చెను స్వామి
ఆదిశంకరమూర్తి యవనికొచ్చె
అద్వైత తత్త్వంబు నమృతోపమట్లుగా
అందించె మనకంత యాది గురువు
రామానుజాఖ్యతో రాజీవనేత్రుని
భక్తితో భజియించ ముక్తి యనుచు
మార్గంబు చూపెను మమకార మూర్తియై
ఆనంద తీర్థులు యరుదెంచి మనకంత హరిసర్వస్వంబంచు నందు జేసె
ఆ.వే.వీరిమార్గ మెపుడు విశ్వస నీయమ్ము
ఆర్తి జనుల కెల్ల యాశ్ర యంబు
ఆర్తి బాపు వారె యాస్తిదోచరెపుడు
ఆప్తు లైరి జగతి యాచరించి

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత