దేవికీదేవ గర్భము
దేవదేవుండంత దేవకీ గర్భాన
అష్టమ పుత్రుడైనవతరించె
జననమేలేనట్టి జగదీశ్వరుండంత
జననిగర్భాన జననమందె
వసుదేవతనయుడై వాసుదేవాఖ్యతో
విష్ణువే తానంత కృష్ణుడాయె
గోపికా లోలుడై గోవర్ధనమునెత్తి
ఇంద్ర గ ర్వమునంత నిసుకజేసె
కృపణుడైన యట్టి కూర్మిసఖునకంత
గీత బోధ తోడ రాత మార్చె
వేణు నాద మాయె వేదాంత వేద్యంబు
ఇట్టి గురువు నింక యిలను గలరె
(రచన:౼విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజశాస్త్రి)
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి