సుయోధనుడు

అభిమాన ధనమున్న అసలుకేముప్పోయి
సుయొధనుబ్రతుకంత శూన్యమాయె
వినయంబు లేకున్న.విశ్వసింపరుజనులు
కులధ్వంసంబుచే కూలెనతడు
చిత్రరథు గంధర్వు చిత్రహింసలతోడ
ఘోషయాత్రమునందు గోలకాగ
పతిభిక్ష కోరగా పాండవుల్ కాచిరి
గోగ్రహణమునందు గోవిందు సఖుచేత
ఓడింప బడినట్టి నొడయుడతడు
దుష్ట డతడు కాడె దుర్యోధనుండను
వానిగొప్ప చేయ నొప్ప రెవరు
నిండుకొలువు నందు నిస్సిగ్గుగానంత
వలువ లిప్ప జూచు తులువ వాడు
(రచన:౼విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజశాస్థ్రి)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత