పరమేశు చరణాలు

ప్రణవ స్వరూపియౌ పరమేశు చరణమ్ము
ప్రణతార్తి హరమైన భద్ర పదము
గరళమ్ము కంఠాన కట్టుదిట్టముచేసి
నీలకంఠాఖ్యతో నెగడినాడు
నటరాజ మూర్తి యై నర్తించి తానంత
అయ్యపస్మారుని యదిమినాడు
మృకండు పుత్రుని మృత్యభయముబాపి
మృత్యంజయాఖ్యతో హృద్యడాయె
శిగలోన గంగను చిత్రమౌ రీతిగా
సంద్రానికంపిన సాంబశివుడు
ఆ.వె.బేసికనుల సామి భేషైన దేవుడు
వెండి కొండ పైన వెలిసినాడు
భక్త వరదు డతడు భవబంధముల్ బాపి
ముక్తి పదము చూపు మోద మలయ
(రచన:--విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజ శాస్త్రి)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత