వివాహబంధము
సుమహూర్త సమయాన చూపులు కలయగా
అనురాగ లతయంత యల్లు కొనియె
మాంగల్య బంధమ్ము మమతానురాగాల
ఆత్మీయ బంధమై యల్లుకొనియె
అక్షతారోపణయానంద సాంద్రమై
అన్యోన్యబంధమ్ము నధిక మగును
సప్తపదులతోడి సన్మిత్రబంధమ్ము
కల్పలతికవోలె. కాంక్షతీర్చు
ఆ.వే.తలుపు పలుకులందు ధర్మార్థ కామాల
నీదు మాట మీర నిక్క మనుచు
వరుడు మాటయొసగె వధువంతోనంత
ఆర్ష ధర్మ మిదియె నవని యందు
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి