మతాంతర వివాహము
అన్యమతపువారియతివతో పెండ్లైన
చింతితార్థము కన్నచింత మిగులు
ప్రణయభావంబంత ప్రళయాగ్ని సదృశమ్ము
మతపుపిచ్చిముదిరి మంట లొదువు
గృహహింస చట్టమ్ము కౄరంబుగా మారు
ధరలోనె నరకమ్ము తప్పదింక
పడతిసుఖముకోరిపడరాని పాట్లాయె
బ్రతుకంత యింకను బండలవును
సుఖము నున్న బ్రతుకు దుఃఖానికెనయౌను
శుచియునుశుభ్రతల్ శూన్య మౌను
బంధు జనుల తోడ బధ్ధవైరమొదువ
తలచు కొన్నరోత తప్ప దోయి
(రచన:౼విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజశాస్త్రి)
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి