వాగర్థములు

వాగర్థ ములరీతి వసుధలో మనకెల్ల
అమ్మనాన్నలటుల నాదరించు
జగదాంబ తోగూడి జగధీశ్వ రుండంత
కనురెప్ప వలరీతి కాయునెపుడు
మారేడు దళముల మహనీయ మూర్తిన
పూజించ తానంత పొంగిపోవు
ధవళాతక్షలరీతి ధావళ్యమైనట్టి
మనసున్న మారాజు మాకు చాలు
ఆ.వే‌ .చంద్ర శేఖరుండు చల్లగా చూడగా
అన్న పూర్ణ తల్లి యాదరించ
కార్తి కేయు డంత కామితార్థముల నొసగ
సుముఖం డెపుడు మాకు సుఖము నిచ్చు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత