అలిగిన అమ్మ
అలకేలనేతల్లి అలకేలనమ్మరో
అలిగినా చూడగా యలవి యగునె
కోపమేలాతల్లి కోమలమ్మందురే
పసివాడి మనసంత పసిడికాదె
చిలిపిపనులనుచు చిర్రెత్తి పోకుండ
లాలించ వలెనమ్మ జోల పాడి
తడబాటు పొడబాటు తనయుగుణమనుచు
నీకంత తెలుసమ్మ నిజముగాను
ఆ.వే.తల్లు లెల్ల నిన్ను తల్లిగా భావించ
తనయులట్లు జగతి తలచు నెపుడు
కట్టు తప్పువారి కట్టడి చేయగా
మరల విత్తు వనుచు మాకు తెలుసు
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి