జగదభి రాముడు

జగదభి రాముడు జానకి రాముడు
అయోధ్యరాముడు నరుగు దెంచె
దశరథ పుత్రుండు ధర్మైక నిష్టుండు
సత్యవాక్యరతుడు సాధుభాషి
పితృభక్తి యతుడు ప్రియభాషనుండును
మనకోస మరుదెంచె మనలకావ
కోదండరాముడై కోమల గాత్రడై
కమనీయ రూపుడై కదలి వచ్చె
మాట తప్ప డతడు మడమతిప్పడతడు
శాత్రవులకుకూడ శరణు నొసగు
పాపకోటి నంత పారద్రోలగలగు
నామమంత్ర మిచ్చురాముడితడు
(రచన:౼విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజశాస్త్రి)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత