రాజీవ లోచనుడు
రాజీవలోచను రామచంద్రునికని
పరవసించనియట్టి బ్రతుకు బ్రతుకె
పరమపావనిసీత ప్రార్థించ లేనట్టీ
జన్మమ్ము జన్మమే జగతిలోన
దాసభక్తికిలను తార్కాణ మైనట్టి
హనుమంతు ప్రార్థింతు నహరహమ్ము
భాతృభక్తికిలను భరతుడే సాక్షిగా
లక్ష్మణుండునిలిచె లక్ష్యమట్లు
ఆ.వే జగతి జనుల కెల్ల జానకీ నాథుడే
గతియు మతియు పతియె కాంచవోయి
వేయి మాటలేల వేడవోయి రాముని
సార్థకంబు కాదె జన్మమంత
(రచన:--విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజ శాస్త్రి)
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి