ఇతిహాసము
ఇతిహాస విభవమ్ము యిలలోనె కాదోయి
జలధిలో కలదంచు తెలయ వలయు
ద్వారకా నగరమ్ము దాగున్న విషయమ్ము
ఉధధిలో కలదంచు నునికి తెలెసె
కట్టుకథలనుచు కానిమాటలుపల్కు
కూహనా మేధావి గుటక మ్రింగ
శ్రీకృష్ణ చరితమ్ము చిరకాల ముండును
వెడగుబెడగులెల్ల వెల్ల నగును
ఆ.వే.క్రీస్తు పూర్వ మనుచు క్రీనీడ వలదోయి
కృష్ణ చరిత చదువ తృష్ణ వలయు
భరత వర్ష ఘనత బ్రహ్మాండ మంతగా
వ్యాప్తి చెంద వలయు వసుధ యందు
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి