శ్రీమతి రమాదేవీ పదవీ విరమణ పంచరత్నాలు

శ్రీమతి రమాదేవి 
పదవీవిరమణ సన్మానోత్సవ 
పద్యమందారం
+++++++++++

శేషాద్రి నిలయుండు శ్రేయస్సు కూర్చగా
భధ్రాద్రి నిలయుండు భద్రమొసగ
ప్రమధాది  పతియంతప్రమదంబు కూర్చగా
కరుణించి కాపాడు కనక దుర్గ
రేపల్లే కృష్ణుడు రేవగల్ కాయంగా
పదవివిరమణమ్ము భధ్రమిచ్చు
ఉత్సాహభరితమౌ నుత్సాహవృత్తమ్ము
బ్రతుకంతా నిండాలి బాగుగాను
ఆ.వె.విసుగు చెందవెపుడు విద్యనొసగువేళ
కటువుమాటరానికల్పతరువు
మాటపలుకులందు మధురత్వమొప్పిన
మంచిమనిషివమ్మ మాన్య చరిత

2)నవభారతంబున నవ్యమౌ రీతిలో
విద్యనం దించిన విదుషివీవు
ముత్యాల సరములు మోహరించిన రీతి
అక్షర పంక్తికి అందమొసగి
నీవెన్క నేనుండే నీకేల భయమంచు
బాలబాలికలకు భయముదీర్చి
పాఠ్యబోధనంత పరమాన్నమటులుండు
బోధచేయగలగు బోధ్ధ వమ్ము
ఆ.వె.నీకు నీవెసాటి నైపుణ్యగుణపేటి
ఎవరుగలరుసాటి నీకు నీవె
అనుభవమునందు నాధిక్యమందిన
ఘనత పొందినావు ఖ్యాతికెక్క

3)
సాంఘిక శాస్త్రాన్ని సామర్థ్యం మొప్పగా
సుగ్రాహ్యమౌరీతి సులభశైలి
అనితర సాధ్యంబునధ్భుతంబౌనట్లు
నేర్పించినావమ్మ నేర్పుమెరసి
పౌరశాస్త్రమునంత భావిపౌరులకీవు 
అందించినా వమ్ము యాస్త తోడ

చారిత్రబోధన చాతుర్యమెప్పగా
కనులకట్టినయట్టి ఘనత నీది
ఆ.వె‌.అర్థశాస్త్రబోధ యాసక్తి కలిగించ
ఛాత్రసమితియంత సంతసించె
నిన్ను బోలు వారు నిలలోన నెవ్వరో
వెదుక వలయునింక  విసువు పడక


4)
కొసరాజువారింటి కోహినూరివనుట
అక్షర సత్యంబ యనిరి జనులు
మారామ"దేవియే "మా"రమాదేవిగా
భావించి నా రమ్ము బంధుజనులు
భేషజమ్ములేనట్టి బేతపూడికుదురు
మెట్టినావనుచు మెచ్చువచ్చె
నగుమోము దళుకెత్తు నాగేశ్వరుండంత
నీవెన్క నిలువుగా నిండు హెచ్చె
ఆ.వె‌.పుత్ర లభ్ధిచేత పుణ్యంబుయదిహెచ్చె
ఆప్తజనులకెల్ల యండనొసగి
ధర్మబుద్ధి వలనదాక్షిణ్య మతిచేత
మోదమందుమింక మాన్య చేరితే

5)
భరత జాతి భవిత భధ్రమౌనట్లుగా
బోధ చేసినావు బాధ్యతొప్ప
విశ్వ గమన మెల్ల విద్యార్థులకునేర్పి
నవ్యపథము వైపు నడపినావు
##########
(ఇతిశం)
రచన:- విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజ శాస్త్రి)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత