శనీశ్వరుడు

ఏడున్నరేండ్లంత యేలికేనావయ్య
శనిదేవ వందన శతము నీకు
కష్టసుఖములంచు కంగారు పెట్టక
కనికరంబొప్పగా కాచినావు
సోదరుండైనట్టి సమవర్తి వోలెను
శిక్షించు బాధ్యత స్వీకరించి
ధరలోన నీవంత ధర్మంబు నిలుపగా
ఇలకువచ్చినయట్టి యీశ్వ యుండు
ఆ.వే.దుష్ట జనుల లోని దురితంబు దునుమాడి
మంచి మనుజు లట్లు మార్చినావు
నీదు ఘనత తెల్ప నేనెంత వాడను
రాశి చక్ర మందు రాజువయ్య
(రచన:---,విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజ శాస్త్రి)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత