కమలాహసన్ పై తిట్టుకవిత

త్యాగరాజుఘనత ధ్రాభయేమియెరుగు
మసిగుడ్డయెరుగునె మానికమ్ము
నీచుడేమియెరుగు నీలంపు వజ్రమ్ము
భ్రష్టుడేమియెరుగు భక్తిఘనత
కుక్క కేమి తెలుసు కువలాయనందమ్ము
మార్జాలమెరుగునె మంత్రమహిమ
రామభక్తవరుని రసరమ్యచరితంబు
హీనాత్ము డెరుగునె యిందు ధరుని
అంగుష్టమాత్రుండత్యల్పడితడోయి
పరువవదిలినట్టి పాపి జన్మ
సామ వేద మహిమ శ్వానమెరుగునెట్లు
పంది పొరలు కాదె పంకమందు
(రచన:-- విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజ శాస్త్రి)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత