ఇక్ష్వాకు ఇందు బింబము
ఇక్ష్వాకు వంశాభ్ధి యిందుబింబమతడు
సాకేత పురవాస సత్య రతుడు
మౌనీంద్రు హృత్సరోమదమరాళమతడు
రామేశు మదినుండు రాముడతడు
భద్రాద్రి వాసుండు భవరోగ వైద్యుడై
ధర్మమ్ము రక్షింప ధరణి నిలిచె
మాతృమూర్తియటుల మమతాను బంధమ్ము
కన్నతండ్రియటుల కరుణ జూపు
శరణన్న వారికి శాశ్వతైశ్వర్యంబు
ఇహముపరములిచ్చు యీశ్వరుండు
ఆ.వె.రామ రామ యనుచు రాజీవ నేత్రుని
హనుమ దాదు లెల్ల హర్ష పులక
గాత్రు లగుచు మిగుల గానంబు చేయగా
భజన చేయుద మిక భక్తి తోడ
(రచన:--విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజ శాస్త్రి)
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి