శఠుడు
నిరతంబు నిష్టతో నిద్రించు శఠుడంత
నిద్రలేపిన చాలు నీల్గు నతడు
గర్భాత్ర బుధ్ధితో కలహించు మూర్ఖుండు
ఉదరపూజకొరకు నుత్సహించు
తినుటలో ఘనతెంచ తిప్పరాజతడయ్య
పనిని చేయ మన్న పలుక కుండు
అమ్మనాన్నలనింక నదిరించు బెదిరించు
ఆలిధనముకొరకు నంగలార్చు
పరుల ధనము కొరకు ప్రాకులాడునెపుడు
వంచనంబు వాని వైఖరాయె
దోమతెరను కట్ట దోమబెడదతీరు
వీని బెడద మాన్ప వీలు లేదె
(రచన:౼విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజశాస్త్రి)
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి