సత్యమే మాతగా
సత్యంబు తల్లిగా సతతంబు రక్షించు
జ్ఞానమే జనకుడై జ్ఞాని జేయి
ధర్మమే యనుజుడై ధర్మాత్ముజేయగా
తపియించు నెప్పుడు ధరణి నిన్ను
కరుణార్ద్ర భావమే కడుమైత్రితో నిన్ను
కంటికి రెప్పలా కాచియుండు
శాంతమే.పత్నియై సహనమే పుత్రుడై
మాత్సర్య భావంపు మంటనుండి
ఆ.వే అనవ రతము నిన్ను నాప్యాయ దృష్టితో
రక్షణంబు నొసగు రక్షరేకు
బంధు జనులు వీరు భవబంధముల నుండి
మనుజునెపుడు బ్రోవ మసలు చుంద్రు
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి