ఆత్మీయత
అనురాగ మున్నట్టియాత్మీయ బంధువుల్
ఆప్యాయ మందించి యాదరించ
సౌజన్య మూర్తులౌ సఖులెల్ల నీతోడ
ప్రేమాభి మానాలు పెంచి పంచ
ఇంపైన తిండియే యింటిలో నుండిన
సొంతింటి సౌఖ్యమ్ము సొంత మైన
హర్షాతి రేకమ్ము యందించునర్ధాంగి
కష్టసుఖములందు కలిసి నడువ
తండ్రిమదినితెల్సి తనయుండు మెలిగిన
కొరతేమి లేదింక కువలయాన
ఆ.వె.ఇట్టి గృహము కాదె యిలలోన స్వర్గము
ధర్మ బుధ్ధి యున్న దక్క వచ్చు
పూర్వ పుణ్యమెపుడు పొల్లుబోవునెటుల
నాగరాజు మాట నమ్ముడింక
(రచన:--విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజ శాస్త్రి)
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి