కవులూ- కపులు

గతరాత్రి కలలోన కవులంత తమలోన
కలహించిరేలనో కపుల రీతి
వచనకవినినేను వచనంబు వినమంచు
బలవంత పెట్టగా కలహ మయ్యొ
వాదకవులమంచు వాదంబు వినమంచు
వాదించ సాగిరి వస్తు కంఠాన నలుపేల కనిపించ లేదంటు
ప్రశ్నించ వద్దండీ పరమశివుని
అరమోడ్పు కనులతో నానంద మూర్తియై
జగతితొ తానంత జాలమాడు
మారేడు తలనుండ మారేడు మావాడు
మాకిచ్చు సిరులెల్ల మరువకుండ
పాములే దండలై పరమేశు మెడలోని
అందాలు చిందించె  నధ్బుతమ్ము
నంది వాహనుండు నయనోత్సవంబుగ
ధర్మ కర్మలెల్ల ధరణి నిల్పి
వారణాసి కొచ్చె వసుధపుణ్యంబు పండగ
దండి మిడగ రండి తత్త్వ మయుని
(రచన:--విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజ శాస్త్రి)



చచ్చెపద్యమనుచు చపలత్వ బుధ్ధితో
చచ్చుకవితయొకటి చదివె నొకడు
ఆ.వే.హైకు కవిత‌ చెప్పి యెక్కళ్ళు పెట్టెను
నాసి కవన మంచు నసిగె నొకడు
ఇట్లు కవుల కవిత యిక్కట్లు పాలాయె
కవుల కవిత లన్ని గాలి కలిసె
(రచన:--విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజ శాస్త్రి)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత