సిగ్గుల మొగ్గ సీతమ్మ తల్లి
సాంబశి వునికంత సాలెపురుగుభక్తి
నిర్మించె గుడినంత నిష్ట తోడ
అర్చనంబేదిరా యష్టమూర్తికనుచు
కావించె పూజంత గజము భక్తి
మణులతో నిర్మింతు మండపం బనుచును
పరమేశు కర్పించె పాము మణిని
చుట్టాలు పక్కాలు చూచువారెవనుచు
చింతించె దిగులతో చెంచు యెకడు
ఆ.వే.కన్నులొసగు నట్టి కన్నప్ప శివభక్తి
కనుల విందు చేయు కథలు.చూడ
భక్తివలయు మనకు భగవంతు మ్రోలను
ముగ్ధ భక్కి కతడు మురియు నతడు
(రచన:--విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజ శాస్త్రి)
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి