కాయమా క్షణికమ్ము
కాయమా క్షణికమ్ము కాలమా యాగదు
పదవేమి యక్కటా!పరుల పాలు
పరువంబు నిలవదు పదికాలముల పాటు
రోగాలు రోష్టులు రోదనాలు
ఆలుబిడ్డలెపుడు నంటకాగరునిన్ను
చూట్టాలు తిన్నగా చూడరకట
నమ్మిన నీవారు నట్టెట ముంచగా
కాలంబు కొరకునై కాచినారు
ఆ.వే.ధర్మమొకెటెనిన్ను దయతో డ రక్షించు
ఎల్ల వేళ లందు యెమర కుండ
బుధ్ధి కలిగి నీవు ముక్తిమార్గంబును
సాగ వలయు నీవు యాగ కుండ
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి