మదిలోని భావాలు మధుర ముధ్ర
మదిలోని భావాలు మౌనముద్రనువీడి
పలుకు పలుకుమంచు పలికె నేమొ
కలలొని కల్పన యిలలోన నిజమట్లు
అనుభూతమగుటయే నద్భుతంబు
దివిలోన తారలు భువిలోన నాతోడ.
ఏమేమి పలికెనో యెరుక లేదు
ఆకాశ వీధిలో నధ్భుతంబౌరీతి
మేఘాలు నాతోడ మేలమాడే
ఆ వే.అణువునణువులోని యందాలు చందాలు
కనులనండుగట్లు కదిలె ముందు
మనసు మాయ చేయ మనసు యెరుగు
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి