ఇందిరాగాంధీ -ఎమర్జన్సీ

జూన్ 25 1975వ సంవత్సరం చాలా చీకటిరోజు ప్రజాస్వామ్యాన్ని నిలువునా హత్యచేసిన చీకటి రోజు.ఇందిరా గాంధిని వ్యక్తిగతంగా ఆరాధించేవారిని చూచి జాలేస్తుంది. డి.కే.బారువా అనే నిలువ త్రాష్టుడు( Indira is India ,India is Indira ") అని వ్యక్తి పూజను పతాక స్థాయికి తీసుకెళ్ళాడు.డిల్లిలోని టర్క్ మెన్ గేటు దురంతంలో ఎంత మంది అసువులు బాసారో?  రాజ్యేంగేతర శక్తిగా అవతరించిన సంజయగాంధీ నిర్భంద కుటుంబ ఆపరేషన్ లు చేయించిన దురంతం ఇప్పటికీ గుర్తే.అమాయకులైన యువకులను నక్సలైట్ ముద్రవేసి ఎన్ కౌంటర్ లు చేసిన సంఘటనలు ఎన్నో! పత్రికా స్వాతంత్ర్యాన్ని పీకనొక్కేయడం జరిగింది.చివరకు R K.లక్ష్మన్ కార్టూన్ లను సెన్సార్ చేశారు.ఎమర్జన్సీ పేరుతో చేసిన అకృత్యాలకు లెక్క లేదు.
 ఇందిరా భజన పరుల మాటవిని జరిగిన ఎన్నికల్లో ఇందిరా గాంధీ  ఆమెసుప్రతుడు చిత్తుగా ఓడిపోవడం హై లైట్.ఆ వార్త ప్రసారం కాకుండా ఎంతో ప్రయత్నించినా ప్రసారం చేయక తప్పలేదు. తెల్లవారి 3-30 బులెటిన్ లో ప్రసారం చేశారు.విచిత్రం మేమంటే ఆల్ ఇందిరా రేడియో గా ప్రసిధ్ధి చెందిన ఆకాశవాణి శ్రీ వెంకటేశ్వర సుప్రభాత ప్రసారంతో ఆ చీకటి అధ్యాయానికి తెరదించారు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత