మేధావులు
ఏతావు లేనట్టి మేధావులందరు
కనవచ్ను దేశాన కనులముందు
మానవ హక్కుల మాసికాలెప్పుడు
పెట్టగలరువీరు పేరు పేర
బడగులనుచువీరు బలహీనలనుచును
మైనారిటీలతో మంట పెట్టు
నయవంచనంబను నమ్మకద్రోహంబు
నక్కజిత్తులతోడి నాటకాలు
మేకవన్నెపులులు మేలమాడినయట్లు
గోముఖవ్యాఘ్రాలు గోలచేయ
తడిగుడ్డతోనంత తత.తర పడకుండ
కోమలంబౌరీతి గొంతుకోయ
పాయసానమ్మున పాషాన విషమును
కలుపగలిగినట్టి గడసుదనము
తిమ్మిబమ్మిగానుబమ్మియనుచు
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి