చిద్వాలసి శ్రీనివాసుడు
శ్రీనివాసుడితడు చిద్విలా సంబుతో
చీకుచింతలనెల్ల చిన్న బుచ్చి
కామితార్థముల నెల్ల కరువులేకుండగ
విన్నంత నేయిచ్చు వెన్న దొంగ
ఆపద మొక్కుల యాలించి పాలించి
యిక్కట్లు పోగొట్టు హితడు మనకు
ఏడుకొండలవాడ వెంకటా రమణంచు
ఎలుగెత్తి పిలువగా యేలుకొనును
నిరతాన్న దానమ్ము నిత్యంబు చేయించి
ఆనంద నిలయుడై హర్ష మందు
కన్నుల నిండుగా కమనీయ మూర్తిని
కాంచలేమైతిమి కన్నులార
ఆ.వే.అనుచు భక్త జనులు నావేద నంబును
కాంచ వలయు నీవు కన్నులార
తల్లి కరుణ వంటి దయనుకురియజేసి
కావ వలయు నీవు కరుణ మమ్ము
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి