పినరాయి వెధవ

పినరాయి యనుచును పిలువనేలనతని
పలుగురాయివలెను బాధపెట్టు
దైవభక్తవరుల దైన్యంబు పెంచగా
ముదముచెందునతడు మురియునతడు
సామ్యవాదియనుచు సాధించు జనతను
మంచిబుధ్ధిలేని మంకు బుద్ది
కక్షగట్టినటుల కార్యంబు చేయగా
శాస్తయతనికింక శాస్తిచేయు
ఆ.వే.మంచిదనము నంత మరచిమార్కిస్టులు
కాలగతిని నింక కలియువారె
చరిత యెవని కూడ జాలిదలచదోయి
ఉన్నమాటయిదియె నుర్విలోన
(రచన:--విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజ శాస్త్రి)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత