కవిత్రయ కవులు
నన్నయ్య మనకిచ్చె నానార్థ రుచిరమౌ
పంచమ వేదాఖ్య భారతంబు
తెనిగించె తిక్కన తేటయౌ తెలుగులో.
పదునైదు పర్వాలు పండగట్లు
శంభుదాసుడతడు సానంద మౌరీతి
భారతారణ్యంబు పదిలపరిచె
బమ్మెర పోతన్న భాగవత సుధలన్ని
పందారమట్లుగా పంచినాడు
ఆ.వే.సీస పద్య రచన శ్రీనాథుడే మేటి
కాశియాత్ర చేయ కాంక్ష దీర్చె
నవ్యగుణములన్ని నాచన సోముండు
తెలుగు వారికిచ్చె చెలిమి మీర
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి